ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన కరీం అనే యువకుడిని పరవాడ పోలీసులు అరెస్టు చేశారు. లంకెలపాలెం గంగిరెడ్ల కాలనీకి చెందిన కరీం, స్థానికంగా నివాసం ఉంటున్న యువతిని మాయమాటలతో లోబర్చుకున్నాడు. పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు సోమవారం పోలీసులు తెలిపారు.