అచ్యుతాపురం: అభిజిత్ కంపెనీని తెరిపించాలి

అచ్యుతాపురంలో అభిజిత్ కంపెనీని తెరిపించి కార్మికులకు న్యాయం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు బుధవారం విజయవాడలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ విజ్ఞప్తి చేశారు. కంపెనీ లాకౌట్ ప్రకటించడంతో 3, 000 మంది కార్మికులు రోడ్డున పడ్డారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్