సోదరి దాడిలో సోదరుడు మృతి

అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఇంటి నిర్మాణ వివాదంలో సోదరి దాడిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఎరిపల్లి నూకరాజును అతని సోదరి కొర్లమ్మ రాయితో గుండెపై దాడి చేయడంతో అస్వస్థతకు గురై మృతి చెందాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్