విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. యూపీ రాష్ట్రం ఫిరోజాబాద్కు చెందిన కులదీప్ సింగ్(23) సెజ్లో గల ఓ కర్మాగారంలో అసిస్టెంట్ కుక్గా పనిచేస్తున్నాడు. అచ్చుతాపురం సెజ్ కాలనీ లక్ష్మీపురంలో గల ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం రెండవ అంతస్థులో గోడపై కూర్చొనగా పక్కనే గల విద్యుత్ వైర్లు చేతికి తగలడంతో షాక్ గురయ్యాడు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతిచెందినట్టు సీఐ తెలపారు