రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

నక్కపల్లి మండలం వేంపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలమంచిలి రాంనగర్‌కు చెందిన పూడి వెంకట శేఖర్ (39) దుర్మరణం చెందాడు. తలుపులమ్మ తల్లి లోవ నుంచి ఎలమంచిలికి బైక్‌పై వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్