ఘనంగా మరిడిమాంబ పండగ

యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కొత్తపాలెం గ్రామంలో వెలసిన శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండగ గురువారం నాడు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి అమ్మవారి గుడి వద్ద క్యూ లైన్ లో నిలిచి అమ్మవారినీ దర్శించుకుని పసుపు, కుంకుమ, చీర, రవిక సమర్పించి మ్రొక్కులు తీర్చుకున్నారు. ఈ పండగకు బంధుమిత్రులను పిలుచుకొని విందు భోజనాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం భారీ బాణసంచా, విద్యుత్ దీపాలంకరణ పలు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్

✕
✕