యలమంచిలి పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ‘జనవాణి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల నుంచి ఆయన స్వయంగా వినతిపత్రాలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.