భక్తులతో కిక్కిరిసిన పూడిమడక సముద్రతీరం

మాఘ పౌర్ణమి సందర్భంగా పూడిమడక సముద్రతీరం భక్తులతో కిక్కిరిసింది. జిల్లా నలుమూలల నుంచి తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం వరకు రద్దీ కొనసాగింది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సూర్య భగవానుడికి నమస్కారాలు చేశారు. స్నానాల కోసం రేవు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్