వర్షాలకు దెబ్బతిన్న పెంకుటిల్లు పై కప్పు

అనకాపల్లి జిల్లా, యలమంచిలి సమీపంలోని రాంబిల్లి మండలంలోని కట్టుబోలు గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు దశమంతరావు పెద్ద సన్యాసిరావు (చిన్ని)కి చెందిన పెంకుటింటి పైకప్పు కూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕