జగన్‌ను కలిసిన అనంతపురం నూతన మేయర్‌ (వీడియో)

AP: తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్‌ను అనంతపురం నూతన మేయర్‌ రమేష్‌ గౌడ్‌ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన రమేష్‌ గౌడ్‌ను  జగన్‌ అభినందించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జగన్ సూచించారు. తనకు మేయర్‌గా అవకాశం కల్పించినందుకు జగన్‌కు రమేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕