అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత

AP: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి చుక్కెదురైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే ఈ కేసులో ఏ2, ఏ3గా ఉన్న కడియాల సతీశ్, మహాలక్ష్మికి కూడా బెయిల్ నిరాకరించింది.

సంబంధిత పోస్ట్