అనంతపురం సోముల దొడ్డిలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆత్మనిర్భర్ భారత్ జిల్లా సన్నాహక సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ వస్తువులనే కొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెల్ కన్వీనర్ చిరంజీవి రెడ్డి, కందిరెడ్డి శ్రీనివాస రెడ్డి, అశోక్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.