అనంతపురంలో శుక్రవారం జరుగుతున్న దులీప్ క్రికెట్ ట్రోఫీలో ఇండియా-సి జట్టు తరఫున ఆడుతున్న క్రికెటర్ ఇంద్రజిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డారు. దీంతో వెంటనే నిర్వాహకులు స్ట్రెచర్పై స్టేడియం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఇంద్రజిత్ స్థానంలో సూతర్ క్రీజ్ లోకి వచ్చారు. ప్రస్తుతం సీ-జట్టు 132 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది.