గుంతకల్లులో దారుణం.. రైతు పై రాళ్లతో దాడి

పామిడి మండలం రామగిరి గ్రామంలో గురువారం లేపాక్షికి చెందిన మామిడి తోటలో అదే గ్రామానికి చెందిన అద్దేప్ప, నాగరాజు తమ గొర్రెల మందను వదిలారు. దీంతో తోటలోని మామిడి మొక్కలను గొర్రెలు మేశాయి. మామిడి తోటలోకి గొర్రెలు ఎందుకు వదిలారని అడగడంతో లేపాక్షితో పాటు అతని మిత్రుడు రమేష్ పై రాళ్లతో దాడి చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్