నీటి సమస్య పరిష్కారానికి కీలక అగ్రిమెంట్

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం దోసలుడికి గ్రామంలో నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి కీలక ఒప్పందం కుదిరింది. గుంతకల్లు శాసనసభ్యులు శ్రీ గుమ్మునూరు జయరాం, గుంతకల్లు మండలం ఇంచార్జ్ శ్రీ గుమ్మునూరు నారాయణ స్వామి సూచనల మేరకు, దేవరగట్టు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ గుమ్మునూరు శ్రీనివాసులు సమక్షంలో శనివారం ఈ ఒప్పందం జరిగింది. హంద్రీ-నీవా కాలువ నుంచి బుగ్గ సంఘాల మీదుగా దోసలుడికి గ్రామానికి కాలువ నీరు చేరేలా సంఘాల, దోసలుడికి గ్రామ ప్రజల మధ్య పరస్పర అంగీకారంతో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా దోసలుడికి గ్రామ ప్రజల చిరకాల నీటి కష్టాలు తీరనున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕