గుంతకల్ లో ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవం, రక్తదాన శిబిరం

గుంతకల్ పట్టణంలోని ఎస్‌కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్నిశుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలువురు విద్యార్థులు ఉత్సాహంగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రానికి అందజేశారు. రక్తదానం చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి యస్. హరి ప్రసాద్ యాదవ్, ప్రిన్సిపాల్ లక్ష్మయ్య, రూరల్ ఎస్ఐ బాలముని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕