పెద్దవడుగూరు మండలం రామరాజుపల్లి గ్రామ సమీపంలోని 44 హైవేపై శనివారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుత్తి నుంచి పామిడి వైపునకు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.