గుత్తి మండలం తురకపల్లిలో శనివారం ఒంటరితనాన్ని భరించలేక బోయ సురేష్ అనే యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు లేని సురేష్, అవ్వ వద్ద ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.