మేడాపురం దళిత వాడలో ఉచిత యునాని వైద్య శిబిరం

చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలోని దళిత వాడలో గురువారం యూనియన్ డాక్టర్ సయ్యద్ తౌఫిక్ ఆధ్వర్యంలో యునాని ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో వివిధ జబ్బులకు చెందిన దాదాపు 60 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకుని వైద్య సేవలు పొందారు. రోగులుకు జబ్బును బట్టి యునాని డాక్టర్ ఉచితంగా మందులు అందజేశారు. ఈ వైద్య క్యాంపులో దాదాపు 60 మంది దాకా రోగులు హాజరయ్యారు. రోగులుకు డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుద్ధత వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕