పోలీసులచే దుకాణదారులకు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం

చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో రామగిరి సీఐ, చెన్నేకొత్తపల్లి ఎస్ఐ, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో స్థానిక దుకాణదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దుకాణాల ముందు చెత్తను రోడ్డుపై వేయకూడదని, ప్రతి దుకాణం వద్ద డస్ట్ బిన్ ఏర్పాటు చేసుకొని చెత్తను అందులోనే వేయాలని సూచించారు. అంతేకాకుండా దుకాణాల ముందు రోడ్డుకు అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేయకూడదని తెలిపారు. తమ హెచ్చరికలను పట్టించుకోని దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕