శింగనమల మండలంలో వికలాంగుల పింఛన్లు తనిఖీ ముమ్మరంగా మంగళవారం సాగుతోంది. మండల పరిధిలోని ఏకుల నాగేపల్లి, లోలూరు, వెస్ట్ నరసాపురం, చిన్న జలాలపురం గ్రామాల్లో తనిఖీ చేపట్టారు. కర్నూల్ వైద్య బృందం లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తరిమెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శంకర్ నాయక్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.