తాడిపత్రిలో కేంద్రం బలగాలు మంగళవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనంతపురం రేంజ్ డీఐజీ షిమోన్షీ ఆధ్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏపీఎస్పీ బలగాలతో అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు కలిసి కవాతు నిర్వహించారు. టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పుట్లూరు రోడ్డు మీదుగా బలగాలు ప్రదర్శించారు. ఎవరైనా ఘర్షణలు జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.