మధ్యాహ్నం భోజన పథకం పరిశీలిన

విడపనకల్లు మండలంలోని కొట్టాలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎస్. హరి ప్రసాద్ యాదవ్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు శుచి, శుభ్రతతో కూడిన రుచికరమైన ఆహారాన్ని వారానికి ఆరు రోజులు అందిస్తున్నామని, ఇందులో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్