రానున్న ఐదు రోజుల్లో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయశంకర్ బాబు, నారాయణస్వామి శనివారం తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలైనా సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.