జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతపురంలో రూ.118 కోట్లతో చేపట్టిన పనుల వివరాలు చెప్పినా, వయసు కారణంగా ఆయనకు అర్థం కాలేదని విమర్శించారు. వైసీపీ పాలనలో రుద్రంపేటలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయని, తానే రోడ్డు వేసి ప్రమాదాలు తగ్గించానన్నారు.