అనంతపురం: 49 ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కొరడా

కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో, రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో ఏడు రోజుల్లో 114 బస్సులను తనిఖీ చేయగా, నిబంధనలు పాటించని 49 బస్సులపై కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రతా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రెండు బస్సులను సీజ్ చేశారు. సీట్ మార్పులు, ఫైర్ అలారమ్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి అంశాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వారం తర్వాత జిల్లాలోని 680 ప్రైవేట్ స్కూల్ బస్సులను కూడా తనిఖీ చేస్తామని, యజమానులకు నోటీసులు జారీ చేశామని డీటీసీ వీర్రాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్