అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరులో గురువారం విషాదకర ఘటన జరిగింది. విద్యామందిర్‌లో నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలిక ఆటోలో పక్కసీటులో కూర్చొని వస్తుండగా ఆకస్మాత్తుగా జారిపడింది. ఈ ఘటనను గమనించని డ్రైవర్ ఆటోను ఆమె తలపై నుంచి పోనియడంతో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై డ్రైవర్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.