తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 47వ డివిజన్‌లో "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమం మంగళవారం విజయవంతంగా జరిగింది. క్లస్టర్ ఇంచార్జ్ దలవాయి రమాదేవి, యూనిట్ ఇంచార్జ్ వెంకటేశులు సమన్వయంతో ఇంటింటి కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొని డివిజన్ సమస్యలు తెలుసుకున్నారు. నడిమివంక సైడ్ కాలువకు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.