ఆదివారం బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే రేటెడ్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ -2026లో దేశవ్యాప్తంగా 815 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. స్విస్ లీగ్ పద్ధతిలో 9 రౌండ్లు జరిగిన ఈ పోటీల్లో, అనంతపురం జిల్లా క్రీడాకారిణి బోనం జాన్విత అండర్ 11 బాలికల విభాగంలో 5/9 పాయింట్లతో 6వ స్థానాన్ని సాధించింది. గ్రాండ్ మాస్టర్ తేజ కుమార్ చేతుల మీదుగా ఆమె ప్రశంసా పత్రం, మెడల్ అందుకుంది. ఈ సందర్భంగా జాన్వితతో పాటు సీనియర్ చెస్ కోచ్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడును పలువురు అభినందించారు.