అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆదివారం నుండి వైద్యుల రిజిస్ట్రేషన్ నవీకరణ ప్రారంభమైంది. గతంలో ఐదేళ్లకొకసారి రెన్యువల్ కోసం వైద్యులు విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈసారి ఏపీ మెడికల్ కౌన్సిల్ అధికారులు జిల్లాలోకే వచ్చి సేవలందించడంతో వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.