అనంతపురంలోని ప్రభుత్వ నెంబర్ - 2 స్కూల్ లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల లక్ష్మీనరసింహులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బలోపేతం చేశారనని, ఇందులో వారి కృషి గర్వకారణమన్నారు. తల్లిదండ్రులతో సమావేశమై అభిప్రాయాలు పంచుకున్నారు.