వివాహమై 25 ఏళ్లు గడిచినా సంతానం కలగకపోవడంతో మనస్తాపానికి గురైన కర్ణాటక చిత్రదుర్గం జిల్లా రాస్తిమేకుంటి గ్రామానికి చెందిన తిప్పేస్వామి (40) నగరంలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య విజయమ్మతో కలిసి నగరానికి వలస వచ్చి, బళ్లారి రోడ్డులో కుండలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సంతానం లేని కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఈ నెల 3న బళ్లారి రోడ్డులోని ఎంజీ మెటాలిక్ ఫ్యాక్టరీ వద్ద అపస్మారకస్థితిలో పడిపోయిన తిప్పేస్వామిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.