ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు పోతుల నాగరాజు అన్నారు. అనంతపురంలో సోమవారం మాట్లాడుతూ ఈ దాడికి కారణమైన కవితతో పాటు దాడిలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీల రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.