గుజరాత్ పై ఆంధ్ర జట్టు ఘనవిజయం.. చక్రిక లెగ్ స్పిన్ మాయాజాలం

నాగ్‌పూర్‌లో జరిగిన బీసీసీఐ అండర్ 15 మహిళల వన్డే టోర్నమెంట్‌లో గుజరాత్‌పై ఆంధ్ర జట్టు ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ, అనంతపురం క్రీడాకారిణి డీ. చక్రిక 4.5 ఓవర్లలో 4 వికెట్లు తీసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి అసాధారణ ప్రదర్శన కనపరిచినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఇది ఆంధ్ర అండర్ 15 బాలికల జట్టుకు తొలి విజయం.

సంబంధిత పోస్ట్