అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు సివిల్ రైట్స్ డే ( పౌర హక్కుల దినోత్సవం) ను గురువారం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సంబంధిత సి. ఐ లు, ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులతో పాటు రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖ మరియు గ్రామ సచివాలయ కార్యదర్శిలు సంయుక్తంగా వెళ్లి రాజ్యాంగంలోని చట్టాలు, పౌర హక్కుల గురించి ప్రజలకు అవగాహన చేశారు.