అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ వ్యవహారంలో బీజేపీకి చెందిన చంద్రకళ రాయల్, మల్లీశ్వరి, అనంత కుమారి అనే ముగ్గురు మహిళా సభ్యులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో, వారిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు రాజేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా ముగ్గురిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు.