285బూత్ లలో బీఎల్ఏలు ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొనాలి

ఈనెల 15వ తేదీ నుంచి 285 బూత్ లలో బీఎల్ఏలు కూడా బీఎల్ఓలతో పాటు ఎస్ఐఆర్ (సర్వే) కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆదేశించారు. అనంతపురం పార్టీ కార్యాలయంలో ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు కూడా పోకుండా చూడాలని, గత ప్రభుత్వంలో జరిగిన వాటిపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇంకా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచనలు చేశారు. ఈ బాధ్యత క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జిలదే అని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్