కణేకల్లు మండలం హనకనహల్ సమీపంలో గాలిమరల విద్యుత్ వైరు తెగిపడి ప్రమాదకరంగా మారింది. గురువారం ప్రమాదవశాత్తు ఆ వైరు తగిలి బసన్నగారి ఆంజనేయులుకు చెందిన ఒక గొర్రె మృతి చెందింది. అప్రమత్తమైన కాపరి వెంటనే మిగతా గొర్రెలు ఆ వైర్లను తగలకుండా పక్కకు తీసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాలిమరల నిర్వాహకులు, అధికారులు స్పందించి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.