ముఖ్యమంత్రి చంద్రబాబు చేసేదే చెబుతారు.. చెప్పిందే చేస్తారు

అనంతపురం టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా 50 మంది లబ్ధిదారులకు మొత్తం 63 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు సహాయం అందిస్తున్నామని, ఇప్పటివరకు 452 మందికి దాదాపు 5 కోట్ల రూపాయల చెక్కులను అందించామని ఎమ్మెల్యే తెలిపారు. మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, వైసిపి హయాంలో ఇలాంటి సహాయం అందలేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్