షేర్ మార్కెట్ పేరుతో డబ్బులు వసూలు

షేర్ మార్కెట్ పేరుతో అధిక డబ్బులు వస్తాయని నమ్మబలికి, అనంతపురంలో నరేష్ రెడ్డి అనే వ్యక్తి తమ నుంచి రూ.10 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు వసూలు చేసి మోసం చేశాడని బాధితులు నాగవేణి, తులసమ్మ ఆరోపించారు. సుమారు 100 మందికి పైగా బాధితులు ఉన్నారని, నరేష్ రెడ్డిపై జిల్లా ఎస్పీ జగదీష్ కు ఐదుగురు బాధితులు ఫిర్యాదు చేశారు. ఓరిజెన్ సొల్యూషన్స్ పేరుతో నరేష్ రెడ్డి మోసాలకు పాల్పడ్డాడని, బాధితులందరికీ న్యాయం చేయాలని, నరేష్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరారు. కోట్లల్లో మోసం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్