మాజీ మంత్రి అంబటిపై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి ఎస్పీ జగదీశ్కు ఫిర్యాదు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మారలేదని నాగరాజు మండిపడ్డారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని అంబటికి హితవు పలికారు.

సంబంధిత పోస్ట్