అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామంలో వైసీపీ నేత వడ్డే పెద్దన్న అసభ్యంగా ప్రవర్తిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నాడని మహిళలు ఎస్పీ జగదీశ్‌కు ఫిర్యాదు చేశారు. బహిర్భూమికి వెళ్లినప్పుడు ఫోటోలు తీసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, ప్రశ్నిస్తే రప్ప రప్ప నరుకుతానంటూ బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఈ సంఘటనపై మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.