అనంతపురం జిల్లా డీఈవో ఎం.ప్రసాద్ బాబు గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో గుండె నాళం బ్లాక్ అయినట్లు గుర్తించిన వైద్యులు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. త్వరలోనే ఆయనకు స్టెంట్ వేయనున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉంది.