అనంతపురం లో ఆర్టీసీ బస్టాండులో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు

అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్, IPS గారి ఆదేశాల మేరకు, సంక్రాంతి పండుగ సందర్భంగా అనంతపురం ఆర్టీసీ బస్టాండులో డాగ్ స్క్వాడ్ తో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు శేషగిరి, రామయ్య, ఎస్సై రాజశేఖర్ రెడ్డి, వారి సిబ్బంది, మరియు జిల్లా డాగ్ స్క్వాడ్ బృందం ఈ తనిఖీలలో పాల్గొన్నారు. బస్టాండ్ మరియు పరిసర ప్రాంతాలలో గంజాయి, మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు వంటి అసాంఘిక వస్తువుల కోసం క్షుణ్ణంగా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్