ట్రాఫిక్ నిబంధనలు, జరిమానాల కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసమే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అనంతపురంలో ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 200 మంది డ్రైవర్లకు GGH వైద్యుల చేత ECG, 2డీ ఎకో, కంటి, దంత పరీక్షలు నిర్వహించామని తెలిపారు. రోడ్డు భద్రత అనేది బాధ్యత కాదని, అది మనందరి కర్తవ్యమని ఆయన అన్నారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు ప్రధాన కారణాలని ఆయన సూచించారు.