అనంతపురం రుద్రంపేటలో 60 ఏళ్ల ఖాజా హుస్సేన్ అనే వ్యక్తి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని, అతనికి గుండు కొట్టించి, దేహశుద్ధి చేశారు. అనంతరం, బాధితురాలి కుటుంబసభ్యులు నిందితుడిని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లోఆదివారం అప్పగించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.