జర్నలిస్టులకు ఉచిత కంటి శిబిరం నిర్వహణ

అనంతపురం మదన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్‌లో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ఉచిత కంటి శిబిరం ఆదివారం ప్రారంభమైంది. శ్రీ మీనాక్షమ్మ ఫౌండేషన్ ప్రతినిధి రవికాంత్ రమణ మాట్లాడుతూ, కంప్యూటర్ వాడకంతో పెరుగుతున్న కంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఉచిత కళ్లద్దాలు, ఆపరేషన్లు అందిస్తామని తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటికే 3,000కు పైగా ఆపరేషన్లు చేశామని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, రేపు కూడా శిబిరం కొనసాగుతుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్