రూట్ సెట్ లో ఫోటోగ్రఫీ లో యువతకు ఉచిత శిక్షణ

అనంతపురం రూట్ సెట్ సంస్థలో ఈనెల 2వ తేదీ నుంచి పురుషులకు 30 రోజుల పాటు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణతో పాటు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్