సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అనంతపురం జిల్లాలోని విడపనకల్లు గ్రామంలో ఏకగ్రీవం కోరుతూ వైసీపీ మద్దతుదారు మల్లికార్జున దండోరా వేయించారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలిస్తానని ప్రకటించారు. ఈ దండోరా వీడియో వైరల్ అవడంతో ఎస్సై ఖాజాహుస్సేన్ అప్రమత్తమయ్యారు. దండోరా వేయించిన వారిని పిలిపించి విచారించారు. అనుమతి లేకుండా దండోరాలు వేయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.