ఇజ్రాయెల్‌లో ఉద్యోగ అవకాశాలు

అనంతపురం జిల్లా ఉపాధి నైపుణ్యాధికారి పల్లవి ఇజ్రాయెల్‌లో 'హోం బేస్డ్ కేర్ గివర్' ఉద్యోగాలకు అర్హులైన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసి, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగిన 25-45 ఏళ్ల వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.1,99,770 వేతనం లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 30 లోపు https://naipunyam.ap.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్